• Login / Register
  • International News | బ్లూస్కై సోష‌ల్ మీడియాకు పెరుగుతున్న యూజ‌ర్లు

    International News | బ్లూస్కై సోష‌ల్ మీడియాకు పెరుగుతున్న యూజ‌ర్లు
    ఎక్స్ ఖాతా నుంచి వైతొలుగుకున్న యూజ‌ర్లు
    అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లే ఇందుకు కార‌ణ‌మా?
    సోష‌ల్ మీడియా, వైర‌ల్ మీడియాలో వైర‌ల్‌

    Hyderabad :  ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించ‌డంతో ఎలాన్‌ మస్క్ కు చెందిన షేర్లు (Elon musk) ఒక్క సారిగా పెరిగిపోతున్నాయి. అయితే ఈ విషయం మాత్రం ఆయనను కలవరపాటుకు గురిచేస్తోంది. అలాగే తన సామాజిక మాధ్యమమైన 'ఎక్స్‌' (X) నుంచి అమెరికన్‌లు పెద్ద సంఖ్యలో వైతొలుగుతున్నారు. ఎలాన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్షుడిగా రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. ట్రంప్‌ ప్రచారానికి ఆయన పెద్ద మొత్తంలో నిధులు సమకూర్చడంతోపాటు స్వయంగా ప్రచారం కూడా చేశారు. అయితే ఈ విధానం కొంతమంది అక్క‌డి అమెరికన్లకు న‌చ్చ‌లేదు. ట్రంప్‌ విజయం అనంతరం ఎలాన్‌ మస్క్‌కు కీలక బాధ్యతలు అప్పగించడంతో ఆ వ్యతిరేకత తీవ్రరూపం దాల్చింది. ఇకపై ‘ఎక్స్‌’ పూర్తిగా రైట్‌వింగ్‌కు మాత్రమే పెద్దపీట వేస్తుందన్న అంచనాలు ‘అసంతృప్తులను’ అమెరిక్ల‌ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూసేలా చేశాయి. అలాగే ఎక్స్‌ ఇటీవల సవరించిన టర్మ్స్‌ అండ్‌ కండీషన్లు సైతం యూజర్‌లు వీడిపోవడానికి మరోక‌ కారణంగా చెప్పుతున్నారు. తన ఏఐ చాట్‌బాట్‌ మోడల్‌ ‘గ్రోక్’కు శిక్షణ ఇచ్చేందుకు యూజర్లు చేసే పోస్టులు, ఫొటోలను వాడుకుంటామని అందులో పేర్కొనడం కూడా మ‌రోక‌ కారణమని చెప్ప‌కుంటున్నారు.
    *బ్లూ స్కై గురించి.. 
    ట్విట్ట‌ర్‌ మాజీ సీఈఓ జాక్‌ డోర్సే స్థాపించిన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫార‌మే ఈ బ్లూ స్కై.  దీనిని 2019లో  ఒక ఇంటర్నల్‌ ప్రాజెక్ట్‌గా రూపొందించారు. తొలుత ఇన్విటేషన్‌ ఆధారంగా తీసుకొచ్చారు. అయితే ఈ ఏడాది దాన్ని పూర్తిస్థాయిలో యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకువ‌చ్చారు. గ‌త సెప్టెంబర్‌ వరకు 10 మిలియన్‌ యూజర్లు మాత్రమే ఉండగా.. అమెరికా అధ్య‌క్ష ఎన్నికల అనంత‌రం దానికి ఒక్కసారిగా క్రేజ్‌ పెరిగింది. దీంతో ప్రస్తుతం 19 మిలియన్‌ యూజర్లతో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఇది అచ్చం ఎక్స్‌లానే పనిచేస్తుంద‌ని, ఫొటోలు, వీడియోలు, డైరెక్ట్‌ మెసేజ్‌లు కూడా పంపుకునే విధంగా ప్లాట్‌ఫారం క‌ల్పించారు. అయితే దీనిలో యూజర్లు ఫాలో అయ్యే అకౌంట్ల నుంచి ఫీడ్‌ మాత్రమే చూపిస్తుంది. వ్యక్తులే తమ ఫీడ్‌ను కస్టమైజ్ చేసుకునే సదుపాయం ఇందులో ఉంది. మిగిలిన కంపెనీల్లా యూజర్ల డేటా కంపెనీ సొంత సర్వర్లలో ఉండదు. యూజర్లు కావాలనుకుంటే సొంత సర్వర్లను వాడుకోవచ్చు. లేదా సంస్థ సర్వర్‌పై ఆధారపడొచ్చు. అయితే మెటాకు చెందిన థ్రెడ్స్‌ కూడా ఎక్స్‌కు పోటీగా వచ్చినప్పటికీ.. దాని అల్గారిథమ్‌ పొలిటికల్‌ పోస్టులకు అంతగా ప్రాముఖ్యం ఇవ్వకపోవడం ‘బ్లూ స్కై’కి కలిసొచ్చింద‌ని, ఇప్పటికే జర్నలిస్టులు, అథ్లెట్లు, ప్రముఖులు బ్లూస్కై ఖాతాలు తెరవడంతో, బ్లూ స్కై తన టీమ్‌ను పెంచుకునే పనిలో పడింద‌ని చెప్పుతున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో, డిజిట‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.
    *  *  * 

    Leave A Comment